భగవద్గీత అంటే ఏమిటి
💐 *గీతా జయంతి,ముక్కోటి ఏకాదశి శుభాాంక్షలు*💐 *భగవద్గీత అంటే ఏమిటి?* *☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?* 👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది. 👉-కర్తవ్యం గురించి చెబుతుంది. 👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది. 👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది. 👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది. 👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. పాప పుణ్యాల వివరణ ఇస్తుంది. 👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది. 👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది. 👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది. 👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది. 👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది. 👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది. 👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది. 👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని. భగవద్గీత....... – జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా? –...