శ్రీ మహావిష్ణువు దశావతారాలు
దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడు. పరమేశ్వరుడూ అంతే సృష్టికోసం అయిదు అవతారాల్లో వ్యక్తమయ్యాడు. ఆ అవతారాలే తర్వాత శివుడి పంచ ముఖాలుగా ప్రసిద్ధి పొందాయి. మహేశ్వరుడు నిర్వహించే అయిదు మహాకృత్యాలైన సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలకు ఇవి ప్రతీకలు. ఇవి భూతనాథుడి అనంతత్త్వాన్ని వివరిస్తాయి. శివపురాణంలో ఉన్న విశేషాలివి... సద్యోజాత అవతారం : శ్వేతవరాహకల్పంలో సృష్టికార్యాన్ని నిర్వహించే సమయంలో బ్రహ్మదేవుడు ముందుగా పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానించాడు. ఆ సమయంలో తెలుపు, ఎరుపు రంగుల మిశ్రమవర్ణంతో ఒక బాలుడు ఉద్భవించాడు. అతడే సద్యోజాతమూర్తి. సృష్టి కార్యక్రమం నిర్వహించటానికి అవసరమైన జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు. తత్పురుషావతారం : పీతావాసకల్పంలో బ్రహ్మదేవుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పీతాంబరాలు ధరించి ప్రత్యక్షమయ్యాడు. తత్పురుష గాయత్రీ మంత్రోపాసన ఫలితంగా ఆవిర్భవించిన ఈ మూర్తి తత్పురుషమూర్తిగా పూజలందుకుంటున్నాడు. తత్పురుష పరమేశ్వర అనుగ్రహం వల్ల బ్రహ్మదేవుడికి సృష్టిక్రియకు అవసరమైన శక్తి వచ్చిందని అంటారు. వామదేవావతారం : రక్తకల్పంలో ఈ అవతారం కనిపిస్తుంది. ...