ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము
ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము:🙏 *1. మత్స్యపురాణం* *2. కూర్మపురాణం* *3. వామన పురాణం* *4. వరాహ పురాణం* *5. గరుడ పురాణం* *6. వాయు పురాణం* *7. నారద పురాణం* *8. స్కాంద పురాణం* *9. విష్ణుపురాణం* *10. భాగవత పురాణం* *11.అగ్నిపురాణం* *12. బ్రహ్మపురాణం* *13. పద్మపురాణం* *14. మార్కండేయ పురాణం* *15. బ్రహ్మవైవర్త పురాణం* *16.లింగపురాణం* *17.బ్రహ్మాండ పురాణం* *18. భవిష్యపురాణం* ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది. *మత్స్యపురాణం:* మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. *కూర్మపురాణం:* కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్ర...