సూర్య గ్రహణ సంభంధిత సంపూర్ణ వివరములు మీ కోసం || 21 june #SuryaGrahan
🌞 *సూర్య గ్రహణ సంభంధిత సంపూర్ణ వివరములు మీ కోసం.....* 💥 *సూర్య గ్రహణము ఎప్పుడు ఉన్నది ?* 🌒 జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు అనగా తేది : 21-06-2020 , ఆదివారము రోజు సూర్య గ్రహణము కలదు. 💥 *ఇట్టి సూర్య గ్రహణము మన భారత దేశానికి వర్తిస్తుందా ?* 🌒 ఇట్టి సూర్య గ్రహణము మన భారత దేశానికి సంపూర్ణంగా వర్తిస్తుంది. 💥 *సూర్య గ్రహణము ఎప్పుడు ప్రారంభమౌతుంది ? ఎప్పుడు ముగుస్తుంది ?* సూర్య గ్రహణము తేది : 21-06-2020 , ఆదివారము , ఉదయము 10-01 ని॥నకు ప్రారంభమౌతుంది. మధ్యాహ్నము 01-28 ని॥లకు పూర్తవుతుంది. *గ్రహణ స్పర్శ కాలము ( ప్రారంభము ) : ఉదయం 10-01 ని॥నకు* *గ్రహణ మధ్య కాలము : ఉదయం 11-38 ని॥లకు* *గ్రహణ మోక్ష కాలము ( ముగింపు ) : మధ్యాహ్నం 01-28 ని॥లకు* ఇట్టి సూర్య గ్రహణం మొత్తం 3 గంటల 27 ని॥ముల నిడివి కలదు. 💥 *గ్రహణ నియమాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పాటించాలి ?* 🌒 గ్రహణ వేధ ప్రారంభము నుండి గ్రహణము సంపూర్ణమయ్యే వరకు అనగా తేది : 20-06-2020 , శనివారము , రాత్రి 10-00 గం॥ల నుండి తేది : 21-06-2020 , ఆదివారము , మధ్యాహ్నము 01-28 ని॥ల వరకు గ్రహణ నియమములు పాటించాలి. 💥 *గ...