సూర్య గ్రహణ సంభంధిత సంపూర్ణ వివరములు మీ కోసం || 21 june #SuryaGrahan
🌞 *సూర్య గ్రహణ సంభంధిత సంపూర్ణ వివరములు మీ కోసం.....*
💥 *సూర్య గ్రహణము ఎప్పుడు ఉన్నది ?*
🌒 జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు అనగా తేది : 21-06-2020 , ఆదివారము రోజు సూర్య గ్రహణము కలదు.
💥 *ఇట్టి సూర్య గ్రహణము మన భారత దేశానికి వర్తిస్తుందా ?*
🌒 ఇట్టి సూర్య గ్రహణము మన భారత దేశానికి సంపూర్ణంగా వర్తిస్తుంది.
💥 *సూర్య గ్రహణము ఎప్పుడు ప్రారంభమౌతుంది ? ఎప్పుడు ముగుస్తుంది ?*
సూర్య గ్రహణము తేది : 21-06-2020 , ఆదివారము , ఉదయము 10-01 ని॥నకు ప్రారంభమౌతుంది. మధ్యాహ్నము 01-28 ని॥లకు పూర్తవుతుంది.
*గ్రహణ స్పర్శ కాలము ( ప్రారంభము ) : ఉదయం 10-01 ని॥నకు*
*గ్రహణ మధ్య కాలము : ఉదయం 11-38 ని॥లకు*
*గ్రహణ మోక్ష కాలము ( ముగింపు ) : మధ్యాహ్నం 01-28 ని॥లకు*
ఇట్టి సూర్య గ్రహణం మొత్తం 3 గంటల 27 ని॥ముల నిడివి కలదు.
💥 *గ్రహణ నియమాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు పాటించాలి ?*
🌒 గ్రహణ వేధ ప్రారంభము నుండి గ్రహణము సంపూర్ణమయ్యే వరకు అనగా తేది : 20-06-2020 , శనివారము , రాత్రి 10-00 గం॥ల నుండి తేది : 21-06-2020 , ఆదివారము , మధ్యాహ్నము 01-28 ని॥ల వరకు గ్రహణ నియమములు పాటించాలి.
💥 *గర్భిణీ స్త్రీలు కూడా పై సూచించిన సమయములలో గ్రహణ నియమములు పాటించాలా ?*
🌒 అందరూ విధిగా పై సూచించిన విధంగా అనగా తేది : 20-06-2020 , శనివారము , రాత్రి 10-00 గం॥ల నుండి తేది : 21-06-2020 , ఆదివారము , మధ్యాహ్నము 01-28 ని॥ల వరకు గ్రహణ నియమములు పాటించాలి.
కానీ చిన్న పిల్లలు , వృద్ధులు , వ్యాధి గ్రస్థులు , అశక్తులు మరియు గర్భిణీ స్త్రీలకు అంత సమయము వరకు గ్రహణ నియమములు పాటించుటకు వీలుకాని పక్షములో తేది : 21-06-2020 , ఆదివారము , ఉదయము 04-45 ని॥ల నుండి మధ్యాహ్నం 01-28 ని॥ల వరకైతే ఖచ్చితంగా గ్రహణ నియమాలను పాటించాలి.ఈ సమయములో మాత్రం సడలింపు లేదు
💥 *ఇట్టి సూర్య గ్రహణ ప్రభావం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నది ?*
⭕ మేష రాశి , సింహ రాశి , కన్యా రాశి , మకర రాశి వారికి 👉 *శుభ ఫలం*
⭕ వృషభ రాశి , తులా రాశి , ధనుస్సు రాశి , కుంభ రాశి వారికి 👉 *మిశ్రమ ఫలం*
⭕ మిథున రాశి , కర్కాటక రాశి , వృశ్చిక రాశి , మీన రాశి వారికి 👉 *అశుభ ఫలం*
💥 *ఇట్టి సూర్య గ్రహణమునకు సంభంధించి మిశ్రమ ఫలము మరియు అశుభ ఫలము కల రాశుల వారు గ్రహణ ప్రతీకూల ప్రభావము కలగకుండా ఉండుటకు ఏమి చేయాలి ?*
🌒 ఇట్టి సూర్య గ్రహణమునకు సంభంధించి మిశ్రమ ఫలము కలిగిన వృషభ రాశి , తులా రాశి , ధనుస్సు రాశి , కుంభ రాశుల వారు మరియు గ్రహణ అశుభ ఫలము కలిగిన మిథున రాశి , కర్కాటక రాశి , వృశ్చిక రాశి , మీన రాశుల వారికి ప్రాణ నష్టము , మాన నష్టము , ధన నష్టము , ఆరోగ్య నష్టములు మరియు మానసిక అశాంతి కలిగే అవకాశము ఉంటుంది.కావున ఖచ్చితముగా *" గ్రహణ శాంతి "* చేయించాలి.మరియు దానాలు ఇవ్వాలి
💥 *సూర్య గ్రహణ మిశ్రమ ఫలము మరియు అశుభ ఫలము కలిగిన వారు ఏ ఏ దానములు చేయాలి ?*
🌒 ఇత్తడి పాత్ర , ఆవు నెయ్యి , బంగారు సూర్య ప్రతిమ ( వీలు కాని పక్షములో వెండిది ) , ఎర్ర వస్త్రము , గోధుమలు మొ॥లగు వస్తువులు సదాచార సంపన్న , సద్భ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
Voice Over By Lakshmi Prasanna
మనం ఆ దేవదేవున్ని పూజించాలేకపోయినా, లేక స్తుతించలేక పోయినా కనీసం ఆయన స్తుతిని ఒకసారి వింటే వెయ్యి జన్మల పాపాలు హరించుక పోతాయని చెబుతుంది మన సనాతన ధర్మం.
Hope you like this video Please Subscribe our channel for more videos like this For Popular Mantras, Bhajans, Aartis, Devotional Songs and Darshan
SUBSCRIBE to: https://www.youtube.com/c/BHAKTHISONG...
Comments
Post a Comment