శారదామాత జీవితచరిత్ర 🌹 Part 34
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺
3⃣4⃣ *వ రోజు*
*మృదుత్వం-కాటిన్యం :--*
🌻🌻🌻🌻🌻🌻🌻
*హరీష్* అనే గురుదేవుల గృహస్థ భక్తుడు, గురుదేవుల సన్యాస శిష్యులు నివసిస్తూ తపస్సు చేసిన వరాహ నగర మఠానికి అప్పుడప్పుడూ వచ్చేవాడు. అతను కూడా సన్యాసం పుచ్చుకొంటాడేమోననే భయంతో ఆతడి భార్య అతని మనస్సును తన వైపు తిప్పుకోవడానికి గట్టిగా ప్రయత్నించింది. అందు నిమిత్తం మందులూ మాకులూ ఉపయోగించింది; కానీ పర్యవసానం విపరీతమై ఆతడికి మతిస్థిమితం లేకుండాపోయింది. ఆ స్థితిలో అతడు కామార్పుకూర్ కు వచ్చాడు. అతణ్ణి చూడగానే ఆతని వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చునని ఊహించిన మాతృదేవి వెంటనే ఎవరైనా వచ్చి ఆతణ్ణి తీసుకు వెళ్లమని వరాహ నగరానికి జాబ్ రాసారు. ఆ ఉత్తరం చూసి శరత్, నిరంజన్ బయలుదేరి వచ్చారు. కానీ వారు వచ్చేలోపుగానే పరిస్థితి విషమించింది. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు *:*
"అప్పుడు హరీష్ కొన్ని రోజులుగా కామార్పుకూర్లో ఉండసాగాడు. భార్య కారణంగా అతడు మతి స్థిమితం కోల్పోయాడు. ఒక రోజు పొరుగు ఇంటికి వెళ్లి, ఇంట్లోకి వెళుతున్నాను. అప్పుడు ఆతడు నన్ను తరమసాగాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎలా తప్పించుకోవాలో నాకు పాలుపోలేదు. ముందుగా అక్కడి ధాన్యం గాదె వెనుక నక్కాను. అక్కడికి కూడా వచ్చి తరమసాగాడు. నా కాళ్లు అలసిపోయేదాకా ఏడెనిమిదిసార్లు ఆతడి చేతులకు అందకుండా ఆ గాదె చుట్టూ పరుగెత్తాను. ఇక ఆ తర్వాత నేను ఓర్చుకోలేకపోయాను. నా స్వస్వరూపాన్ని ఆవహింపచేసుకొన్నాను. ' ఆతణ్ణి పట్టుకుని చెంపలు ఎడాపెడా వాయించి, క్రిందపడదోశాను. నా మోకాలును ఆతని ఛాతీపై ఉంచి, నాలుక పట్టుకుని బయటికి లాగి, మళ్లీ చెంపలు నా శక్తినంతా ఉపయోగించి వాయించాను. నా రెండు చేతులు ఎర్రబారేదాకా వాడి చెంపలు వాయించాను. ఆతడు ఊపిరాడక గిలగిలలాడాడు. లజ్జా, వినమ్రత, మూర్తీభవించిన వ్యక్తి మాతృదేవి. కానీ ఆ మృదుతం కూడా తన స్త్రీత్వానికి భంగమని తెలుసుకున్నప్పుడు కాఠిన్య మయింది; ఆమె ఒక పురుషుణ్ణి కొట్టి కిందపడవేయగలిగారు.
ఈ సంఘటనకు తర్వాత మాతృదేవి కామార్పుకూర్ జీవితంలో కొద్దిగా మార్పు వచ్చింది. ఇలాంటి కఠోర తపోజీవితం ఆవశ్యకం లేదని గురుదేవులు కూడా అనుకున్నారో ఏమో! మాతృదేవి తమ పరిస్థితిని గూర్చి ఎవరికీ చెప్పలేదు. అయినా కలకత్తాలో ఉంటున్న గురుదేవుల శిష్యులకు ఈ విషయం ఎలాగో తెలియవచ్చింది. ఒకసారి మాతృదేవి ప్రసన్నమయితో , రాత్రి తమకు తోడుగా ఉండడానికి ఒక *పని మనిషిని* పంపమన్నారు. మాతృదేవికి తోడుగా ఉన్న ఆ పనిమనిషి ఆమె ఉప్పుకూ, తిండికి పడుతున్న ఇబ్బందులను, వేదనను బహిరంగంగా చెప్పారు. కొన్ని రోజులలో ఈ విషయం జయరాంబాటిలో *శ్యామసుందరికి*(మాతృదేవి తల్లి) తెలిసింది. ఆమె క్రుంగిపోయింది; వాళ్ల ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే! అయినా తన శారద పేదరికంతో బాధపడటం సహించలేకపోయింది. వెంటనే మాతృదేవిని తీసుకురమ్మని కాళీకుమార్(మాతృదేవి తమ్ముడు) ను పంపింది, కానీ అప్పుడు వెళ్లడానికి మాతృదేవి నిరాకరించారు. తర్వాత ఒక రోజు ఆమే జయరాంబాటికి వెళ్లారు. తన కుమార్తె దారుణ పరిస్థితి చూసి శ్యామసుందరి తట్టుకోలేక బిగ్గరగా విలపించసాగింది, ఇక కామార్పుకూరు వెళ్లవద్దనీ జయరాంబాటిలోనే ఉండిపొమ్మని ప్రాథేయపడింది. కానీ మాతృదేవి, "ఇప్పుడు నేను కామార్పుకూర్కి తిరిగివెళతాను. తర్వాత ఆయన చూపించే మార్గంలో పోతాను" అంటూ వెళ్లిపోయారు.
కానీ శ్యామసుందరి ఈ విషయాన్ని ఇంతటితో వదలలేదు. కలకత్తాలో పౌరోహిత్యం చేసుకొంటున్న తన కుమారుడు ప్రసన్నకు ఈ విషయం చెప్పిపంపారు. ఈ విషయం విన్న ప్రసన్న అమిత కోపంతో దక్షిణేశ్వరంలో రామ్
లాల్ ను కలుసుకున్నాడు, కుటుంబానికి పెద్దగా మాతృదేవిని పోషింపవలసిన బాధ్యతను గురించి ఆతనికి నొక్కి చెప్పాడు. తన సోదరికి తోడూ నీడా లేకుండా దారిద్ర్యంతో జీవించేలా చేసినందుకు గట్టిగా చీవాట్లు పెట్టాడు. తర్వాత గోలాప్ మాను కలుసుకొని, "శ్రీరామకృష్ణుల శిష్యులయిన మీరు కలకత్తాలో ఉంటూ కూడా ఉప్పు కూడా లేని కేవలం ఆకుకూర తినేటట్లుగా మాతృదేవిని ఎలా వదిలేశారు?" అని ఆమెతో వాపోయాడు.
గోలాప్ మా వెంటనే మాతృదేవిని చూసుకునే బాధ్యతను చేపట్టింది. కలకత్తాలో ఉంటున్న గురుదేవుల సన్న్యాస శిష్యులను, భక్తులు కలుసుకొని మాతృదేవి శోచనీయ పరిస్థితిని గురించి తెలియజేసి ఎలాగైన సాయపడాలని అందరినీ అభ్యర్థించింది. అందుకొసం డబ్బు కూడా సేకరించింది. శ్రీరామకృష్ణ భక్తుల పేరిట మాతృదేవికి హృదయం హత్తుకుపోయేలా ఒక ఉత్తరం వ్రాసి ఆమెను కలకత్తాకు రావలసిందిగా అభ్యర్థించింది.
ఆ జాబు మాతృదేవికి అందింది. ఆమె ఎంతో కలవరపడ్డారు. కలకత్తాకు చేరాలా వద్దా అనే సందిగ్ధావస్థలో పడిపోయారు. నేను ముప్పై నాలుగేళ్ల వయస్కురాలైన వితంతువును, బంధువులు లేని అన్యుల మధ్యలో వెళ్లి ఉండడం అంటే....' ఎలాంటి నిర్ణయానికి రాలేని మాతృదేవి గ్రామస్థుల అభిప్రాయం తెలుసుకోగోరారు.
మాతృదేవి కలకత్తా వెళ్లడం వారిలో పలువురు ఇష్టపడలేదు. అప్పుడు కూడా ప్రసన్నమయి మాతృదేవికి అండగా నిలిచింది; ఆమె, గ్రామవాసులతో గదాయ్ భార్య గురించి ఈ గ్రామ ప్రజలకు ఏం తెలుసు? *గదాయ్ శిష్యులు ఆమెకు బిడ్డలు, బిడ్డల కోరిక మన్నించి కలకత్తా వెళ్లడంలో తప్పేముంది* ?" అంది. మాతృదేవి, తల్లి అభిప్రాయం తెలుసుకోవడానికి జయరాంబాటి వెళ్లారు. మాతృదేవి కలకత్తాకు వెళ్లడం ముందు శ్యామసుందరి అంతగా ఇష్టపడలేదు. కానీ కామార్పుకూర్ ప్రజలు కనబరుస్తున్న ఏవగింపు, విద్వేషం, దూషణ వీటినన్నిటిని చూసిన శ్యామసుందరి, మాతృదేవి కలకత్తా వెళ్లడానికి సంతోషంగా అనుమతించింది. దాదాపు తొమ్మిది నెలలు కామార్పుకూర్ లో గడపిన మాతృదేవి 1888 ఏప్రిల్ లో కలకత్తాకు బయలుదేరారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment