దీపావళి రోజు లక్ష్మీ కుబేర వ్రతం చేస్తే
దీపావళి రోజు లక్ష్మీ కుబేర వ్రతం...
పురాణాల ప్రకారం యక్షులకు రాజు, సిరి సంపదలకు అధిపతి కుబేరుడు. ఈయన్నే ధనపతి అని కూడా అంటారు. ఎనిమిది దిక్కులలో ఉత్తర దిక్పాలకుడే కుబేరుడు..ఈయన నగరం అలకాపురి. విశ్రావసుని కుమారుడు, రావణుడికి సోదరుడు. కుబేరుడు అంటే అవలక్షణాలున్న శరీరం కలవాడు. (బేరం అంటే శరీరం) అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే ఈయన పొట్టిగా (మరగుజ్జులా), పెద్ద బాన పొట్టతో, మూడు కాళ్లు, ఒకే కన్ను, ఎనిమిది పళ్లోతో ఉంటాడని పురాణాలలో చెప్పబడింది.
హిందువుల ముఖ్యమైన పండుగలలో దీపావళి ఒకటి. దివ్వెలు వెలిగించే ఈ దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతం, వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే కుబేర వ్రతాన్ని ఆచరిస్తే రుణ బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని పండితులు పేర్కొంటున్నారు. నరకాసురుని వధించిన మర్నాడు దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటారు. దీపావళి రోజు పీఠంపై కుబేర ప్రతిమను ఉంచాలి. దీని ముందు బియ్యపు పిండితో మూడు వరుసల్లో (3*3) తొమ్మిది గళ్లను వేయాలి. ముందు మూడు గళ్లలో 27,25,23, తర్వాత మూడు గళ్లలో 22,24,26, చివరి మూడు గళ్లలో 23,28, 21 సంఖ్యలను వేయాలి.
ఈ సంఖ్యలతో కూడిన ముగ్గును బియ్యం పిండితో అలంకరించి, 9 నాణేలను వాటిలో ఉంచాలి. పూజకు ఎరుపు రంగు పువ్వులను ఉపయోగించాలి. కుబేర పూజకు నాణేలు, ఎరుపు పువ్వులు తప్పనిసరి. దీపారాధనకు ముందు కుబేర శ్లోకం లేదా కుబేర మంత్రాన్ని 11 సార్లు పఠించడం ద్వారా అనుకున్న కార్యాలు నెరవేరుతాయి.
tq
ReplyDelete