శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺
*_🌹శ్రీ శారదామాత జీవితచరిత్ర🌹_*
1⃣8⃣ *వ రోజు*
🌻🌻🌻🌻🌻🌻🌻
ఎవరైనా బద్దకస్తులుగా ఉండడాన్ని గురుదేవులు సుతరామా ఇష్టపడరు.
ఈ విషయంగా మాతృదేవి
కాలాంతరంలో ఒక శిష్యురాలితో ఇలా అన్నారు:
"గురుదేవులు నాతో, ' *ఎల్లప్పుడూ చురుగ్గా* *ఉండాలి.* ఏ పని చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. *బద్ధకం చోటుచేసుకుంటే పనికిమాలిన ఆలోచనలు మాత్రమే మనస్సులో తలెత్తుతాయి.* అంటూ
అప్పుడప్పుడూ చెప్పేవారు.
భక్తులు రావడం, ఆడడం, పాడడం, పారవశ్య స్థితులలో గురుదేవుల గది ఆనంద నిలయంగా ఉండేది. కానీ ఆయననే భర్తగాను, గురువుగాను, దైవంగాను స్వీకరించిన మాతృదేవి దాన్లో పాలుపంచుకోలేకపోయారు. 'నేను భక్తులలో ఒకరిగా ఉండివుంటే సదా ఆయన దగ్గరే ఉండేదాన్ని వారి అమృతవాక్కులను వినగలిగి ఉండేదాన్ని' అంటూ తపించిపోయేవారు. కానీ గడ్డిపోచకన్నా వినమ్రత, భూమి కన్నా సహనం సంతరించుకున్న మహోన్నత భక్తురాలయిన మాతృదేవి తమ తపనను బయటికి చూపకుండా, తమకంటూ ఎలాంటి ప్రత్యేక హక్కులను ఆశించలేదు. గురుదేవులకు చిన్నచిన్న సేవలను అప్పుడప్పుడూ వెళ్ళి అందించడంతోనే ఆమె తృప్తి పడ్డారు. అలాంటి సందర్భాలు దొరకనప్పుడు వాటిని ప్రశాంతంగా సహించారు.
భోజనం తీసుకుని వెళ్లే సమయాల్లో
మాత్రమే ఇప్పుడు మాతృదేవికి గురుదేవుల సాన్నిధ్య భాగ్యం లభించేది. ఒకసారి గోలాప్ మా తన అమాయకత్వంతో ఈ సందర్భాన్ని కూడా మాతృదేవి కోల్పోయేలా చేసింది.
గురుదేవులు తనను ఆహారం వడ్డించమని చెప్పడాన్ని గొప్పగా చేసుకుని, తాను వడ్డిస్తే ఆయన చాలా ఆనందించినట్లుగా చెప్పుకొంది. ఆ తర్వాత ఆమే ప్రతిరోజూ నహబత్తు నుండి గురుదేవులకు భోజనం తీసుకెళ్లసాగింది. మాతృదేవికి దక్కిన ఆ ఒక్కగానొక్క సందర్భం కూడా చేజారిపోయింది.
రాత్రి సమయాలో గురుదేవులు ఆలయానికి ఉత్తరాన ఉన్న సరుగుడు తోపుకు నిత్యకృత్యాలను తీర్చుకోవడానికి వెళ్లేటప్పుడూ, తిరిగి వచ్చేటప్పుడూ నహబత్తును దాటి వెళ్లేటప్పుడూ చూసుకునేవారు. గురుదేవులను చూడలేకపోవడంతో ఎంతో దుఃఖపడినా ఈ విషయంగా ఎవరికీ ఏదీ చెప్పకుండా తమలోనే అన్నిటినీ ఓర్పుతో సహించారు. *'భగవంతుడు అందరికీ చెందినవాడు'* అని గురుదేవులు నేర్పించారు కదా, అలాగే గురుదేవులు కూడా అందరికీ చెందినవారని సర్ది చెప్పుకున్నారు.
కాలాంతరంలో ఈ రోజులను గురించి మాతృదేవి ఇలా అన్నారు:
కొన్ని సమయాల్లో వారిని ఒక్కసారి కూడా చూడకుండా, రెండు నెలలు గడచిపోయేవి
అప్పుడు నా మనస్సుకు నేను, 'మనసా! వారిని నిత్యమూ దర్శించుకోవడానికి నువ్వు ఎంత పుణ్యం సంపాదించావు కాబట్టి'? అని అంటూ నచ్చజెప్పుకొనేదాన్ని.
కానీ మాతృదేవి ఆలోచనలు మాత్రం సదా ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి రాసాగాయి. సమయం దొరికినప్పుడల్లా తడికెల సందు నుంచి గురుదేవుల గదిలో జరిగేవాటిని చూస్తూ ఉండేవారు. 'చెమ్మగిల్లిన కళ్లతో నీ కోసం ఎదురు చూస్తూవుంటుంది' - కృష్ణుని కోసం రాధ మనఃస్థితిని ఇక్కడ మనం మాతృదేవిలో చూస్తాం!
మాతృదేవి తపన గురుదేవులకు తెలియకపోలేదు. అందువల్ల తమ గదిలో
జరిగేవాటినన్నిటినీ మాతృదేవి చూడాలని తమ గది ఉత్తర ద్వారాన్ని ఎప్పుడూ తెరిచి ఉంచేవారట! తడికె రంధ్రం రోజు రోజుకూ పెద్దదవడం చూచిన గురుదేవులు ఒక రోజు తమాషాగా రాంలాల్ తో, 'ఓ రాంలాల్! తడికెలోని రంధ్రం రోజురోజుకి పెద్దదవుతూ వస్తోంది. ఒక రోజు మీ పిన్ని ముసుగు వ్రతం గాలిలో ఎగిరిపోతుంది చూడు!' అన్నారు. అందుకు రాంలాల్, “బాబాయ్! అందుకు కారణం మీరే! నేను ఉత్తరపు వాకిలి మూసినా కూడా మీరే పదే పదే తెరచి ఉంచుతున్నారు' అన్నాడు.
ఎనలేని భక్తి, సేవ, పవిత్రతలకు ఆనవాలుగా మాతృదేవి నిలిచారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌸శ్రీ శారదామాత చరితామృతం🌸
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment