శారదామాత జీవితచరిత్ర పార్ట్-1

శారదామాత జీవితచరిత్ర

పూర్వికులు - తల్లిదండ్రులు 

🌻🌻🌻🌻🌻🌻🌻

పశ్చిమ వంగదేశంలోని బాంకూరా జిల్లా ఆగ్నేయ మూలలో ఉన్న కుగ్రామం
జయరాంబాటి. కలకత్తా నుండి దాదాపు అరవై మైళ్ల దూరంలో నెలకొని ఉంది ఈ గ్రామం.

జయరాంబాటిలో ముఖర్జీ , బెనర్జీ అనే రెండు శాఖల బ్రాహ్మణులు ప్రధానంగా నివసిస్తూ వచ్చారు.
వీరితోపాటు ఇతర కులస్తులు కూడా నివసించేవారు. ముఖర్జీలు సామాన్యంగా పౌరోహిత్యం చేసేవారు. వంశపారపర్యంగా ముఖర్జీలు, బెనర్జీల మధ్య వైవాహిక సంబంధాలు నెలకొని ఉండేవి. వారి ఇష్టదైవం
 శ్రీరామచంద్రుడు . వేర్వేరు కులాలవారు నివసిస్తున్నప్పటికీ జయరాంబాటి గ్రామస్థులు ఐకమత్యంగా ఉండేవారు.

ముఖర్జీ వంశంలో వచ్చిన వ్యక్తి రామచంద్ర (శారదా మాత తండ్రి). నిరాడంబరత, ప్రశాంతత,పవిత్రత లాంటి సుగుణాల నెలవు ఆయన. ఆయన సద్గుణ సంపత్తిని గ్రామస్తులందరూ గౌరవించేవారు. 

ఆయనకు త్రైలోక్యనాథ్,
ఈశ్వరచంద్ర, నీలమాధవ్ అనే ముగ్గురు తమ్ముళ్లు.

త్రైలోక్యనాథ్ ఆరితేరిన సంస్కృత పండితుడు. కానీ యువప్రాయంలోనే చనిపోయాడు. ఈశ్వరచంద్ర, నీలమాధవ్ వివాహం చేసుకోలేదు. సోదరులంతా
ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. 

రామచంద్ర  పేదవాడే;
వ్యవసాయం, పౌరోహిత్యం, జంధ్యాలు వాడికి అమ్మడం. వీటి ద్వారా లభించే రాబడితో కుటుంబ ఖర్చులు సర్దుకుని ఏదో కొంత పొదుపు చేసేవాడు. 

పేదవాడే అయినప్పటికీ రామచంద్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రాహ్మణ ఆదర్శాల నుండి వీసమెత్తయినా వైదొలగక జీవించాడు.సామాన్యంగా గ్రామప్రజలలో కానవచ్చే సంతృప్తి, అతిథి సత్కారంలాంటివి రామచంద్రలో అధిక పాళ్లలో ఉండేవి.

భర్త ఉదాత్త గుణాలకు దీటుగా, ఆయనకు తగిన భార్యగా వ్యవహరించింది
 శ్యామసుందరీదేవి (శారదామాత తల్లి). సిహోర్ కు చెందిన హరిప్రసాద్ మజుందార్ కుమార్తె ఆమె.
ఏదీ దుబారా చేయకుండా శ్రద్ధగా సేకరించి ఉంచుకొనేవారు.అరమరికలు లేకుండా అందరితోసహజంగా మెలగే స్వభావమూ, కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకొనే సమర్థతా ఆమె పుణికిపుచ్చుకొన్న సుగుణాలు.

 ఈరోజు నుండి ప్రతిరోజు శారదామాత జీవితచరిత్ర  వస్తుంది.🙏💐 

🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32

శారదామాత జీవితచరిత్ర🌹 Part 35

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18