శ్రీ శారదామాత జీవితచరిత్ర🌹 పార్ట్ 17
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺
1⃣7⃣ *వ రోజు*
🌻🌻🌻🌻🌻🌻🌻
కనీస వసతులకు కూడా నోచుకోని ఆ గదిలో మాతృదేవి ఎదుర్కొంటున్న అసౌకర్యాలను గమనించిన గురుదేవుల భక్తులలో కొందరు 1874లో ఆలయానికి సమీపంలోనే ఆమెకై ఒక చిన్న ఇల్లును కట్టాలని నిర్ణయించుకున్నారు. మధుర్ బాబు మరణించిన తర్వాత గురుదేవుల బాధ్యతలను *శంభుమల్లిక్* అనే భక్తుడు
వహించాడు. శంభుమల్లిక్ *రెండు వందల యాభై రూపాయలు* వెచ్చించి ఆలయ సమీపంలో స్థలం కొని ఇల్లు కట్టించాడు.
మాతృదేవి ఆ కొత్త ఇంటిలో నివసిస్తున్నప్పుడు గురుదేవులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆయనకు నడవడం కూడా కష్టమైపోయింది. ఏంచేయాలో పాలుపోక మాతృదేవి నిర్ఘాంతపోయారు. సాధ్యపడినప్పుడల్లా వెళ్లి గురుదేవులకు కావలసిన సపర్యలను చేసిపెట్టారు. కానీ ఎంత చేసినా ప్రక్కనే ఉండి చూసుకొన్నట్లు కాదు కదా!
సరిగ్గా మాతృదేవి ఇలా ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు ఒకామె వచ్చింది.
కాశీ నుండి వస్తున్నట్లుగా పరిచయం చేసుకొంది. ఆమె గురుదేవులకు కావలసిన పరిచర్యలను మనఃస్ఫూర్తిగా చేసింది. ఆమె ఒక రోజు మాతృదేవితో, "ఆయన ఇలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు ఇక్కడ(కొత్త ఇల్లు) ఉండడం తగదు" అంటూ మాతృదేవిని మళ్లీ నహబత్తులో నివసించేట్లు చేసింది.
ఆ స్త్రీ ఎవరు? ఎలా వచ్చింది? ఎవరికీ తెలియరాలేదు. దీనికోసమే వచ్చినట్లుగా ఉంది. ఆమె రాక! గురుదేవులకు సపర్యలు చేసింది, ఆయన వ్యాధి నయం కాగానే వెళ్లిపోయింది. ఆ తర్వాత మాతృదేవి ఎంత ప్రయత్నించిన ఆమెను గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు. గురుదేవుల సపర్యల కోసం నహబత్తుకు వచ్చిన మాతృదేవి మళ్లీ ఆ కొత్త ఇంటికి వెళ్లలేదు. ఆ ఇంటిలో ఒక్కసంవత్సరం మాత్రమే ఉన్నారు.
రోజులు గడిచే కొద్దీ గురుదేవుల భక్తుల సంఖ్య పెరగసాగింది. మాతృదేవికి వంటపని కూడా ఎక్కువయింది. పలువురు భక్తులు అప్పుడప్పుడు గురుదేవులతో పాటు ఉండిపోవడం పరిపాటి అయిపోయింది.
"రెండు మూడు సేర్ల పిండి చపాతీలు చేయడంతో పాటు మాతృదేవి కట్టే తమలపాకు చిలకలకు లెక్క లేదు.
గురుదేవులకు మీగడపాలంటే ఇష్టం కాబట్టి, చాలాసేపు జాగ్రత్తగా పాలు కాస్తూ ఉండేవారు. గురుదేవుల ఉదరం సున్నితమైనది. కొన్ని నిర్దిష్టమైన పద్ధతులలో వండిన ఆహారాన్ని ఆయన జీర్ణం చేసుకోగలిగేవారు. వంట పద్దతిలో మార్పు వచ్చినా పొట్ట భరించలేదు. అందువల్ల ఆయన ఆహారం బహు జాగ్రత్తగా మాతృదేవి తయారు చేయవలసివుండేది.
మాతృదేవి జయరాంబాటికి(పుట్టింటికి) వెళ్లినప్పుడు గురుదేవులకు ఆహారం విషయంలో చాలా ఇబ్బంది కలిగేది. కొన్ని సమయాల్లో మాతృదేవి వద్దకు మనిషిని పంపించి ఆమెను దక్షిణేశ్వరానికి రప్పించుకొనేవారు.
*బహిష్టు రోజుల్లో* మాతృదేవి వంట చేయరు. అందువల్ల గురుదేవులు కాళికాలయ ప్రసాదాన్ని తీసుకోవాల్సి వచ్చేది. వెంటనే *అజీర్ణంతో* బాధపడేవారు. ఒకసారి ఇలా చాలా ఇబ్బంది పడినప్పుడు మాతృదేవి వద్దకు వెళ్లి వంట చేయమని చెప్పారు. అందుకు మాతృదేవి వెనుకాడుతూ, *“ఈ రోజుల్లో స్త్రీలు* *వంట చేయరాదు"* అని అన్నారు. వెంటనే గురుదేవులు, “ఎవరు అలా అన్నారు? నువ్వు నా కోసం వంట చేయి. అందువల్ల నీకు ఎలాంటి పాపమూ
అంటుకోదు.
అవును - *నువ్వు బహిష్టు, అశుద్ధం అంటున్నావు కదా!* *శరీరంలో ఏ భాగం బహిష్టుగా ఉందో చెప్పగలవా? చర్మమా, మాంసమా, ఎముకల, లేక మజ్జా? ఇందులో ఏది అశుద్దమయింది?* ఇదిగో చూడు! *శుద్ధం, అశుద్ధం ఇవన్నీ మనసుకు సంబంధించినవి, బయట ఏదీ లేదు"* అన్నారు.
ఆచార అనుస్ఠానాలతో ఊరిపోయిన ఒక పల్లెటూరి స్త్రీగా ఉన్నా గురుదేవులు చెప్పింది యథాతథంగా స్వీకరించారు మాతృదేవి. ఆ తర్వాత ఆమే నిత్యం వండడం మొదలు పెట్టారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment