శారదామాత జీవితచరిత్ర పార్ట్ 19
🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ మాత్రే నమః🌺
*🌹 _శారదామాత జీవితచరిత్ర_* 🌹
🌻🌻🌻🌻🌻🌻🌻
గురుదేవులు సర్వసంగపరిత్యాగియైనా స్త్రీల మనోభావాన్ని బాగా గ్రహించినవారు. తన ఆవశ్యకతలను, చిన్న చిన్న ఆకాంక్షలను భర్తే గ్రహించి పూర్తిచేయాలని స్త్రీ ఆశిస్తుంది. అందువల్ల తమ శక్తి మేరకు ఆయన మాతృదేవి కోర్కెలను, అవసరాలను తీర్చారు.
మాతృదేవికి ఆభరణాలు ధరించాలనే కోర్కె ఉండేది. ఆమెకు ఆభరణాలు చేయించాలని సంకల్పించారు గురుదేవులు. ఆలయం నుండి *ప్రతి నెల జీతంగా వచ్చే ఏడు రూపాయలను* ఒక పెట్టెలో వేసి ఉంచడం రివాజు. ఆ డబ్బుతో మాతృదేవికి ఆభరణాలు చేయించాలని అనుకున్నారు ఆయన.
ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు.
“నాకు ఆభరణాలు ధరించాలనేకోర్కె గురించి చెబుతూ గురుదేవులు, 'ఆమె పేరు శారద. ఆమె సరస్వతీ అవతారం. అందువల్లనే ఆభరణాలు ధరించాలని ఆకాంక్షిస్తున్నది' అనేవారు.
ఒక రోజు హృదయంతో ఆ పెట్టెలో ఎంత డబ్బుందో చూడు! ఆమెకు చక్కని బంగారు ఆభరణం ఏదైనా చేసిపెట్టాలి” అన్నారు. అప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగా లేదు. అయినా మూడు వందల రూపాయలు పెట్టి నాకు నగలు చేయించి ఇచ్చారు. *ఆయన డబ్బును తాకలేరనే విషయం ఇక్కడ గమనార్హం.* మాతృదేవి చేతులకు ధరించిన 'బంగారు గాజులు'
అప్పుడు గురుదేవులు చేయించినవే. వాటితోపాటు బంగారు అడిగ, గుండ్రని ముక్కు పుడక, చెవులకు దుద్దులు లాంటి నగలను కూడా మాతృదేవి ధరించారు.
తన సహధర్మిణి భవిష్యత్తుకై డబ్బు కూడా సేకరించి ఉంచారు గురుదేవులు.
మాతృదేవి ఇలా అనేవారు: “గురుదేవులు త్యాగమనే పదానికి తాత్పర్యంగా నిలిచారు. అయినా నా గురించి బెంగ ఆయనకు ఉండనే వుంది. ఒకరోజు నాతో నీ ఖర్చులకు ఒక నెలకు ఎంత కావాల్సివస్తుంది?' అని అడిగారు. 'ఐదారు
రూపాయలు చాలు అన్నాను నేను. తర్వాత, 'సరే! రాత్రుళ్లు ఎన్ని చపాతీలు తింటావు?” అని అడిగారు. లజ్జతో ముడుచుకుపోయాను. ఈ ప్రశ్నకు ఎలా బదులు చెప్పాలో అంతుబట్టలేదు. కానీ ఆయన మాత్రం ఆ ప్రశ్ననే పదే పదే అడిగారు. ఇక గత్యంతరంలేక, ఐదు లేకపోతే ఆరు' అని చెప్పాను. మాతృదేవి చెప్పిన విషయాన్ని మనస్సులో ఉంచుకుని గురుదేవులు సుమారు 600 రూపాయల మూలధనంపై వచ్చే వడ్డీతో మాతృదేవి ఇబ్బంది పడకుండా జీవనం గడపవచ్చని తెలుసుకొన్నారు. 'అలాగే ఆ డబ్బును బలరాం బోసు వద్ద జమ చేసి ఉంచారు. ఆతడు ఆ పైకాన్ని తన ఎస్టేటులో వెచ్చించి వడ్డీగా ముఫ్పై రూపాయలను ఆరు నెలల కొకసారి మాతృదేవికి పంపాలని తీర్మానించారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment