శారదామాత జీవితచరిత్ర Part -2

🌻🌻🌻🌻🌻🌻🌻

🌹శ్రీ మాత్రే నమః🌹

🌸 శ్రీ శారదామాత జీవితచరిత్ర 🌸
         పార్ట్ 2

 *జననం:-* 

🌻🌻🌻🌻🌻🌻🌻

ధర్మం క్షీణించినప్పుడు దానిని పునరుద్ధరించడానికి తాను అవతరిస్తానని *శ్రీకృష్ణుడు* *భగవద్గీతలో* చెప్పివున్నాడు.

అవతార పురుషుల ఆగమనాన్ని గుర్తించలేకపోవచ్చు. కానీ వారి తల్లితండ్రులకు మాత్రం ఈ వాస్తవం తెలియవస్తుంది. కొన్ని దివ్యస్వప్నాల, దివ్యదృశ్యాల ద్వారా తమ ఆగమనాన్ని భగవంతుడు సూచిస్తాడు.మాతృదేవి జీవితంలో కూడా ఇలాంటి కొన్ని సంఘటనలు
కానవస్తాయి.

కుటుంబ ఆదాయాన్ని పెంపొందింప ప్రయత్నించాడు రామచంద్ర. పట్టణానికి వెళ్లి డబ్బు ఆర్జించాలని అనుకున్నాడు. కానీ గట్టి
నిర్ణయానికి రాలేకపోయాడు.
ఇలాంటి స్థితిలో ఒక రోజు దానిని గురించే యోచిస్తూ పడుకొని ఉండగా
నిద్రపట్టేసింది. అప్పుడు ఒక కలవచ్చింది. 

ఆయన కంఠాన్ని రెండు చిన్నారి చేతులు పెనవేసుకొన్నాయి.అట్లే కళ్లు తెరచి చూశాడు రామచంద్ర. తదేకంగాచూస్తూ ఉండిపోవాలనిపించే అందమైన చిన్నారి.  అంతటి అద్భుత సౌందర్యం.“అమ్మ! నువ్వెవరివి?” అని ఆమెని అడిగాడు. ఆయా
కంఠాన్ని మరింతగా పెనవేసుకొని, *“ఇదిగో, నేను నీ వద్దకే వచ్చాను”* అంటూ ఉండగా అంతే! కల చెదిరిపోయింది. 

సాక్షాత్తూ మహాలక్ష్మియే అనే నిర్ణయానికి వచ్చాడు. తను ధనార్జనకైపోతున్న ప్రయత్నంలో సంపదలకు అధిదేవతయైన *శ్రీమహాలక్ష్మియే* అనుమతి ప్రసాదించినట్లుగా ఎంచి రామచంద్ర కలకత్తాకు బయలుదేరాడు.

భర్త కలకత్తా వెళ్ళిన తరువాత *శ్యామసుందరీదేవి* తన తండ్రితో పుట్టింట
సీహోర్లో నివసించసాగింది. 

ఒకనాటి సాయంత్రం. సమీపంలోని కొలను తీరాన శ్యామసుందరీదేవి బిల్వవృక్షం కింద కూర్చునిఉంది. హఠాత్తుగా కాంచిన దృశ్యం కింకిణీ (చిరుగజ్జెల) నాదం వినవచ్చింది.అప్పుడు చెట్టుకొమ్మల నుండి జుర్రుకుంటూ వచ్చింది ఒక అందమైన పాప. మెరుపు వేగంతో వచ్చి ఆమె మెడను తన చేతులతో చుట్టివేసింది.
మధురస్వరంతో, *“నేను నీ ఇంటికి వస్తున్నానమ్మ"* అని చెప్పింది.

శ్యామసుందరీదేవి ఆ మాటలు విని మూర్చ పోయింది. వెతుక్కుంటూ వచ్చిన బంధువులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లారు. కాసేపటికి ఆమె కళ్లు తెరిచింది.రామచంద్ర తిరిగి రాగానే శ్యామసుందరి తాను గాంచిన దివ్య దృశ్యం గురించి ఆయనకు చెప్పింది. జగజ్జనని అనుగ్రహం వలన తమ ఈ పూరిగుడిసెలో ఒక దివ్యబాల జన్మించబోతున్నది;  ఆ దివ్యబాల రాకకై ఆ దంపతులు నిరీక్షిస్తూ రోజులు గడపసాగారు.

🌻🌻🌻🌻🌻🌻🌻
   🌺శ్రీ శారదామాత చరితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32