శారదామాత జీవితచరిత్ర పార్ట్ 8

🌻🌻🌻🌻🌻🌻🌻

🌺శ్రీ మాత్రే నమః🌺

🌹 శారదామాత జీవితచరిత్ర 🌹

పార్ట్ 8

🌻🌻🌻🌻🌻🌻🌻

శ్రీరామకృష్ణులు ఈసారి కామార్పుకూరుకు(పుట్టిన ఊరు) వచ్చినప్పుడు, ఆయనకు తాంత్రిక సాధనలు నేర్పించి, గురువు స్థానం వహించిన భైరవీ బ్రాహ్మణి కూడా ఆయనతో పాటు వచ్చింది. ఉద్దండ
పండితులున్న మహాసభలో
శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషులని శాస్త్రప్రమాణాలు చూపించి,నిరూపించింది.

శిష్యుని బ్రహ్మచర్య జీవితానికి భంగం వాటిల్లుతుందేమోనని శంకించిన బైరవి,శారద విషయంగా హెచ్చరిక చేసింది.శారదా పట్ల ఎప్పుడూ కఠినంగానే ప్రవర్తించేది భైరవి.
ఆమెను సొంత అత్తగారిలా భావించి సేవలు చేయమని శ్రీరామకృష్ణులు శారదకు,
చెప్పారు. సహజంగానే సరళురాలైన శారద, భైరవి బెదరింపులను ప్రశాంతంగా సహించింది.శారద సరళత అనే పదునైన ఆయుధాన్ని చేపట్టి, మౌనంగా అన్నిటినీ సహించింది. త్వరలోనే భైరవి తన తప్పును గ్రహించింది.

 శ్రీ శారదా, రామకృష్ణులు ప్రత్తి, నిప్పులాంటి వారనీ,
సన్నిహితులయితే వారి జీవితం వినాశనమవుతుందని భైరవి భావించింది. కానీ వారిద్దరూ అగ్ని గోళాలు, ఒకరి నొకరు సమీపిస్తే ఇంకా ప్రజ్వలంగా ప్రకాశిస్తారుగాని, నశించరని అర్థం చేసుకొంది. తన తప్పిదాన్ని గ్రహించి అందరికీ క్షమార్పణలర్పించి, కామార్పుకూరు నుండి సెలవు తీసుకొని కాశీకి వెళ్లి తన అంతిమకాలాన్ని తీవ్రమైన సాధనలలో గడిపింది.
🌻🌻🌻🌻🌻🌻🌻
సుమారు *ఏడు నెలలు* కామార్పుకూరులో గడిపి శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి బయలుదేరారు.  ఇన్నిరోజులు పరమానందసాగరంలో
ఓలలాడిన శారద కూడా తన శరీరాన్ని మాత్రం భారంగా మోసుకుంటూ జయరాంబాటికి వెళ్లి ప్రశాంతంగా జీవితాన్ని పునఃప్రారంభించింది. తన హృదయంలో ఆనందపూర్ణకుంభాన్ని ప్రతిష్ఠించి వెళ్లిన ఆ దివ్య 'పురుషునితో ఆమె మనస్సు మాత్రం వెళ్లిపోయింది. మళ్లీ ఎప్పుడు ఆయనను చూడగలనా అనే తహతహతో ఎదురుచూడసాగింది.

🌻🌻🌻🌻🌻🌻🌻
   🌹 శ్రీ శారదామాత చారితామృతం 🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32

శారదామాత జీవితచరిత్ర🌹 Part 35

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18