శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 11

🌻🌻🌻🌻🌻🌻🌻

🌺శ్రీ మాత్రే నమః🌺

 *🌹శ్రీ శారదామాత జీవితచరిత్ర 🌹* 

1⃣1⃣ *వ రోజు* 

*దారి తప్పిన సమాజానికి ఆదర్శప్రాయమైన మార్గాన్ని చూపడమే శారదారామకృష్ణుల అవతార ఉద్దేశం.* 

🌻🌻🌻🌻🌻🌻🌻

శారదాదేవి, శ్రీ రామకృష్ణులు కామవాంఛ తమ జీవితాలలో ప్రవేశించరాధనే విషయంలో ఎంతో అప్రమత్తత
వహించారు. చరిత్ర ఇంతదాకా కనీవిని ఎరుగని ఆధ్యాత్మిక సాధనలను *పన్నెండు సంవత్సరాలు* నిరంతరాయంగా అనుష్ఠించి శ్రీ రామకృష్ణులు తమను
పూర్తిగా భగవంతుని పరికరంగా మలచుకొని, అర్పించుకొన్నారు. ఆయన మనస్సేకాక దేహం సైతం దివ్యత్వాన్ని
సంతరించుకొన్నది.
ఆయనలో విషయవాంఛలు అణుమాత్రమైనా ఉండడానికి ఆస్కారమే లేదు.

 కానీ శారద ఇప్పుడిప్పుడే సాధనాపథంలో అడుగుపెడుతుంది. ఆమె మనస్సు ఎలాంటి స్థితిలో ఉందోనన్న సంశయం ఆయనకు కలిగింది. 

ఒక రోజు తమ సంశయాన్ని నేరుగా ఆమెతో అన్నారు. “అవును శారదా! నన్ను లౌకిక లంపటంలోకి లాగడానికి నువ్వు వచ్చావా? ”అంటూ వ్యక్తంచేశారు. 

తక్షణమే,  “ *కానే కాదు* . నేనెందుకు మీ జీవితాన్ని పాడుచేయాలి? మీ సాధనలో సాయపడడానికే వచ్చాను" అంది శారద. 

శ్రీరామకృష్ణుల మనస్సు తేలికపడింది. "ఆమె అంత పావని కాకపోయిఉంటే, నేను కూడా ఇంద్రియ వివశుడనై, లౌకికజీవితంలో మునిగిపోయి ఉండేవాడినేమో. 

వివాహనంతరం *కాళీ మాతను* నేను, *'అమ్మా! ఈమె మనసులో నుండి కామగంధాన్ని పూర్తిగా తొలగించి వేయి'* అంటూ ప్రార్థించాను. నా ప్రార్థన నూటికి నూరు పాళ్లు నెరవేరడం శారద జీవితంలో కనిపించింది" అంటూ కాలాంతరంలో జ్ఞాపకం తెచ్చుకొని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.

 ఒక రోజు రాత్రి శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతూ శారద, "అవును, *నన్ను మీరెలా చూస్తున్నారు* ?" అని అడిగింది. 

తక్షణమే శ్రీ రామకృష్ణులు, "ఎందుకు? *మాతగానే!* ఆనందస్వరూపిణియైన *జగజ్జనని* స్వరూపంగానే నిన్ను చూస్తున్నాను. *ఆలయంలో విగ్రహ రూపంలోని ఆమె, ఈదేహాన్ని కనిన తల్లిగా నహబత్తులో! ఇప్పుడు ఆమె నా పాదాలు ఒత్తుతున్నది"* అని అన్నారు. శారదకి అంతా
అర్థమైపోయింది. ఈయనకూ పిచ్చికీ ఎలాంటి సంబంధం లేదనే కాక, మనస్సు లో స్పష్టత గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఈయన మాత్రమే అని కూడా ఆమెకు చక్కగా అవగతమయింది.

కలసి ఉంటున్న రోజుల్లో పరస్పరం సహాయం చేసుకుంటూ ఉన్నత జీవితం గడపాలనే తీర్మానంతో ఇద్దరూ జీవించసాగారు.
శారద పగటివేళ నహబత్తులో, రాత్రిపూట శ్రీరామకృష్ణుల గదిలోనూ గడిపింది.

వారు ఎందుకు ఈ విధంగా జీవించాలి? 

 *కచ్చితంగా లోకానికి ఆదర్శప్రాయంగా ఉండడానికే.* 

ఎలాంటి ఆదర్శం? 

 *శారీరక సుఖమే జీవితసర్వస్వం కాదన్నదే ఆ ఆదర్శం.*


🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32