_శారదామాత జీవితచరిత్ర_* 🌺 Part 29
🌻🌻🌻🌻🌻🌻🌻
🌸శ్రీ మాత్రే నమః🌸
2⃣9⃣ *వ రోజు*
*గురుదేవి :-*
🌻🌻🌻🌻🌻🌻🌻
మాతృదేవి మహత్తర జీవితంలో మరొక ముఖ్యమయిన కార్యం *మంత్రదీక్ష.* కాలాంతరంలో, ఇష్టదైవం మంత్రం ప్రసాదించి అసంఖ్యాకుల జీవితాలలో జ్ఞానజ్యోతి వెలిగించాడు. దక్షిణేశ్వర రోజులలోనే గురుదేవులు మాతృదేవికి పలుదైవాల మంత్రాలను నేర్పించి, వాటిని వ్యక్తుల మనస్తత్వాలు తగ్గట్లు ప్రసాదించే విధానాన్ని నేర్పించారు. మాతృదేవి దానిని ఇంతవరకు అమలు చేయలేదు.
ఇప్పుడు గురుదేవులే దాన్ని మాతృదేవి జీవితంలో ప్రారంభించేశారు. తమ
యువశిష్యుడైన శారదాప్రసన్నుని మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకోమని చెప్పి మాతృదేవి వద్దకు పంపారు. ఇలా గురుదేవిగా మాతృదేవి కార్యం మొదలయింది.
గురుదేవుల నిర్యాణం విషయంలో మాతృదేవి చివరి అనుభవాలు *:*
కాశీపూర్ ఉద్యానంలో ఒక ఈత చెట్టు ఉండేది. ఒక రోజు సాయంత్రం నిరంజన్ ప్రభృత యువ భక్తులు ఈత రసం తాగడానికి ఆ వృక్షాన్ని సమీపించారు. అప్పుడు గురుదేవులు పరుపుమీద పడుకుని వున్నారు. తమంతట తాముగా లేవడమో, కూర్చోవడమో చేయలేని మరీ బలహీనమైన స్థితిలో ఉన్నారాయన. కానీ హఠాత్తుగా లేచి బాణంలా దూసుకొంటూ కిందికి దిగి పరుగెత్తారు. మాతృదేవి యాదృచ్ఛికంగా అది చూశారు. గురుదేవులు లేచి పరుగెత్తడాన్ని నమ్మలేని మాతృదేవి, ఆయన గదికి వెళ్లి చూసారు. అక్కడ గురుదేవులు లేరు; కానీ కాసేపటికల్లా తిరిగి వచ్చి, ఏమీ జరగనట్లు, పడుకున్నారు. వీటినన్నిటిని ఆర్చర్యంతో చూస్తున్న మాతృదేవి ఆయన వద్దకెళ్లి వివరాలు అడిగారు. కానీ తాము పరుపు నుండి లేచి వెళ్లడాన్నే నిరాకరిస్తూ, "నేనేమిటి? లేచి పరుగెత్తి వెళ్లడమేమిటి? అంతా నీ భ్రమ. పొయ్యి వద్ద నిలబడి నీ మెదడు వేడెక్కిపోయింది” అని అన్నారు. కానీ మాతృదేవి వదల్లేదు. గుచ్చిగుచ్చి అడగ్గా నిరంజన్ ప్రభృతులు వెళ్లిన ఈత చెట్టుకు ఒక నాగుపాము ఉన్నట్లు, దానిని తరిమివేయడానికి తాము వెళ్లినట్లు తెలిపారు.
ఇక్కడ పడుకున్న ఆయన ఉద్యానవనంలో తారట్లాడే పామును ఎలా చూశారు? అలా అయితే తాము ఇష్టపడితే ఈ వ్యాధిని నయం చేసుకొనే సమర్థులు కూడా! తాము గానే ఈ వ్యాధిని స్వీకరించారు” అని మాతృదేవి చింతనచేయసాగారు.
కొన్ని రోజుల క్రితం గురుదేవులు మాతృదేవితో, *దుఃఖమనేది ఎంతవుందో,* *దాన్ని పూర్తిగా* *నేను*
*అనుభవించి వేశాను.* మీరెవరూ ఎలాంటి దుఃఖాలను అనుభవించవలసింది లేదు. లోకంలోని అందరికోసమూ నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను” అని అన్నారు. దాని నిజమైన అర్థం మాతృదేవి ఆ రోజు ప్రత్యక్షంగా గ్రహించారు.
మరొక అనుభవం :
మరొక రోజు మాతృదేవి ఇవే ఆలోచనలలో మునిగి కూర్చుని వున్నారు. అప్పుడు హఠాత్తుగా ఆమెకు ఒక దృశ్యం కనబడింది. దీర్ఘమైన కేశాలుగల నల్లటి స్త్రీ ఒకరు ప్రత్యక్షమై మాతృదేవి పక్కన కూర్చుంది. ఆమె సాక్షాత్తు కాళికాదేవి అని గ్రహించారు మాతృదేవి. కానీ కాళికాదేవి మెడ కాస్త వంకరగా ఉంది. అది చూసిన మాతృదేవి, "నీ మెడకు ఏమైందమ్మా?” అని అడిగారు.
కాళికాదేవి : నాకు గొంతులో వ్రణం వచ్చింది.
మాతృదేవి : ఓ భగవంతుడా! గురుదేవులకు గొంతులో వ్రణం. మరి నీకు కూడా వచ్చిందే!
కాళికాదేవి : అవును.
ఇలా గురుదేవులూ, కాళికాదేవి అభిన్నులని (ఒక్కటే) మాతృదేవికి తెలియవచ్చింది. కాళీమాతే తనకు వ్రణం వచ్చిందని స్వయంగా చెప్పినప్పుడు, ఆమె దానిని నయం చేసుకోదనే కదా అర్థం. ఇక మార్గాంతరం లేదని మాతృదేవికి స్పష్టమయిపోయింది.
🌻🌻🌻🌻🌻🌻🌻
🌹శ్రీ శారదామాత చరితామృతం🌹
🌻🌻🌻🌻🌻🌻🌻
Comments
Post a Comment