శారదామాత జీవితచరిత్ర Part 3


🌺శ్రీ మాత్రే నమః🌺

🌹 శారదామాత జీవితచరిత్ర 🌹 

          3⃣ వ రోజు 

 జననం :-
🌻🌻🌻🌻🌻🌻🌻
శ్యామసుందరి మొట్టమొదటిసారి గర్భవతి అయింది. 'మాసాలలో
మార్గశిర' మని శ్రీ కృష్ణుడు
శ్లాఘించిన మార్గశిర మాసం వచ్చింది. మన పురాణాల ప్రకారం ఆరునెలలు నిద్రించే దేవతలు మేల్కొనే కాలమిది. కృష్ణపక్ష సప్తమి నాటి చలితో కూడిన సాయంత్రం. అప్పుడప్పుడే చీకట్లు క్రమ్ముకొంటున్నాయి. ఉత్తర నక్షత్రం ఉచ్చ స్థితిలో వున్న ఆ సమయంలో వారు ఎదురుచూస్తున్న ఆ దివ్యబాల జన్మించింది. అది 1853 వ సం|| డిసెంబరు 23 తేదీ. జ్యోతిష్కులను పిలిపించి జాతకం గణించారు. 

సామాన్యంగా వంగదేశంలో జాతకం ప్రకారం ఒక పేరు పెడతారు; అందరూ పిలవడానికి మరొక పేరు పెడతారు. జాతకం ప్రకారం పెట్టిన పేరు ఠాకూర్ మణి. శ్యామసుందరి పెట్టుకొన్న ముద్దు పేరు క్షేమంకరి ,ఆ రోజు అక్కడికి శ్యామసుందరీదేవి సోదరి రావడం తటస్థించింది. ఆమెకు శారద అనే ఆడపిల్ల ఉండేది. కొంతకాలం క్రితం ఆ పాప చనిపోయింది.
అందువలన ఆమె, శ్యామసుందరీ దేవితో, "అక్కయ్యా! నీ పిల్లకు శారద అని నామకరణం చేయి. అప్పుడు నా కుమార్తె నీ ఇంట్లో ఉన్నట్లు భావించుకొని ఓదార్పు పొందుతాను" అని వేడుకొంది. అందుకు శ్యామసుందరీ దేవి సమ్మతించింది. ఆ పాప పేరు  శారదగా మారింది.

ఆమె తరువాత కాదంబినీ అనే కుమార్తె, ప్రసన్నకుమార్, ఉమేష్ చంద్ర, కాళీకుమార్, వరదప్రసాద్, అభయచరణ్ అనే ఐదుగురు కుమారులు జన్మించారు.
🌻🌻🌻🌻🌻🌻🌻
   🌸శ్రీ శారదామాత చరితామృతం🌸

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32