శారదామాత జీవితచరిత్ర Part 6

🌻🌻🌻🌻🌻🌻🌻

🌸శ్రీ మాత్రే నమః🌸
🌹 శారదామాత జీవితచరిత్ర 🌹

Part 6

🌻🌻🌻🌻🌻🌻🌻

వధువు కోసం వెదకడం
మొదలు పెట్టారు. శ్రీరామకృష్ణులకు ఈ విషయం
తెలిస్తే మొండికెత్తవచ్చునని ఆయనకు తెలియకుండానే మంచి సంబంధాలు
వెతకసాగారు. ఏ కారణంగానో ఏ సంబంధమూ కలిసిరాలేదు. దాంతో అందరూ ఆందోళనచెందారు. అప్పుడు ఒక రోజు శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో, "వధువు కోసం అక్కడా ఇక్కడా వెతకి ప్రయోజనం లేదు. జయరాంబాటిలో
రామచంద్రుని ఇంట్లో నా కోసం ఉంది. అక్కడికి వెళ్లి విచారించండి” అన్నారు. జయరాంబాటికి మనిషిని పంపి విషయం తెలుసుకొన్నారు.

పిల్లకు ఐదేళ్లు, అయినా చంద్రమణి వివాహానికి సమ్మతించింది. కన్యాశుల్కం కూడా చంద్రమణి పేదరికానికి తగ్గట్లు కొంత తక్కువగానే ఇచ్చారు. కాని *వరుని వయస్సు ఇరవై మూడు.* అమ్మాయి ఇంటి వారు కన్యాశుల్కంగా మూడు వందల రూపాయలిచ్చారు. *1859, మే* నెలలో ఒక శుభ ముహూర్తంలో శ్రీ శారదా రామకృష్ణుల *వివాహం* ఎంతో నిరాడంబరంగా జరిపోయింది. 
🌻🌻🌻🌻🌻🌻🌻
  శారదను ఆమె పినతండ్రి అయిన *ఈశ్వర ముఖర్జీ* తమ భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లారు. ఆమెను అమిత ప్రేమతో ఆహ్వానించింది చంద్రమణి.

 అప్పుడు ఒక సమస్య తలెత్తింది. పేదరికం కారణంగా పెళ్లికూతురికి కొత్త నగలు పెట్టలేకపోయింది చంద్రాదేవి. అయినా ఉత్సాహంతో కొన్ని నగలను అరువుగా తెచ్చి శారదకు అలంకరించింది. ఇప్పుడు ఆ నగలను వారికి వాపసు చేయాలి. కానీ శారద ఆనగలను తనవిగానే భావించి పొంగిపోయింది. వాటిని ఆ అమ్మాయి నుండి ఎలా తీసుకోవాలి? చంద్రమణికి ఏమి
పాలుబోలేదు.

తల్లి సమస్యను అర్థం చేసుకున్నారు శ్రీరామకృష్ణులు. శారద నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలియకుండా నగలనన్నిటినీ తీసి తల్లికి అందచేశారు. ఉదయం మేల్కొన్న శారద తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. చెవులు, ముక్కు మెడ - అన్నీ తాకి చూపిస్తూ, అక్కడ ఉండిన నగలన్నీ ఎక్కడ అంటూ ఏడుస్తూ అడిగింది. చంద్రమణీదేవి అమిత ఆవేదనతో  “అమ్మ! శారదా! ఇవేం గొప్ప నగలు! వీటికన్నా చాలా మంచినగలను ఎన్నిటినో నీకు గదాయి చేయిస్తారు చూడు!" అంటూ అనునయించసాగింది.ఎలాగో శారదా తాత్కాలికంగా ఉపశమనం పొందింది.

 కానీ సరిగ్గా ఆ రోజే ఈశ్వర ముఖర్జీ విషయం తెలుస్కొని మండిపడి వెంటనే శారదను తన భుజాల మీద ఎత్తుకొని జయరాంబాటికి వెళ్లిపోయాడు. దాంతో చంద్రమణీదేవి చలించిపోయింది.

శ్రీరామకృష్ణులు  తల్లి ఆవేదనను చూచి,"అమ్మా! నువ్వు ఎందుకు ఆవేదన పడుతున్నావు? వారి ఏమైనా చెప్పనీ, ఏమైనా చేయనీ! జరిగిపోయిన వివాహాన్ని ఎవరు రద్దు చేయలేరు కదా!" అంటూ అనునయపరిచారు. తర్వాత ఎలాగో పరిస్థితి చక్కబడింది.

🌻🌻🌻🌻🌻🌻🌻
🌺శ్రీ శారదామాత చారితామృతం🌺
🌻🌻🌻🌻🌻🌻🌻

Comments

Popular posts from this blog

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 18

శారదామాత జీవితచరిత్ర🌹 Part 33

శ్రీ శారదామాత జీవితచరిత్ర Part 32