🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 *_🌹శ్రీ శారదామాత జీవితచరిత్ర🌹_* 1⃣8⃣ *వ రోజు* 🌻🌻🌻🌻🌻🌻🌻 ఎవరైనా బద్దకస్తులుగా ఉండడాన్ని గురుదేవులు సుతరామా ఇష్టపడరు. ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఒక శిష్యురాలితో ఇలా అన్నారు: "గురుదేవులు నాతో, ' *ఎల్లప్పుడూ చురుగ్గా* *ఉండాలి.* ఏ పని చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. *బద్ధకం చోటుచేసుకుంటే పనికిమాలిన ఆలోచనలు మాత్రమే మనస్సులో తలెత్తుతాయి.* అంటూ అప్పుడప్పుడూ చెప్పేవారు. భక్తులు రావడం, ఆడడం, పాడడం, పారవశ్య స్థితులలో గురుదేవుల గది ఆనంద నిలయంగా ఉండేది. కానీ ఆయననే భర్తగాను, గురువుగాను, దైవంగాను స్వీకరించిన మాతృదేవి దాన్లో పాలుపంచుకోలేకపోయారు. 'నేను భక్తులలో ఒకరిగా ఉండివుంటే సదా ఆయన దగ్గరే ఉండేదాన్ని వారి అమృతవాక్కులను వినగలిగి ఉండేదాన్ని' అంటూ తపించిపోయేవారు. కానీ గడ్డిపోచకన్నా వినమ్రత, భూమి కన్నా సహనం సంతరించుకున్న మహోన్నత భక్తురాలయిన మాతృదేవి తమ తపనను బయటికి చూపకుండా, తమకంటూ ఎలాంటి ప్రత్యేక హక్కులను ఆశించలేదు. గురుదేవులకు చిన్నచిన్న సేవలను అప్పుడప్పుడూ వెళ్ళి అందించడంతోనే ఆమె తృప్తి పడ్డారు. అలాంటి సందర్భాలు దొరకనప్పుడు వా...
🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 🌹 శారదామాత జీవితచరిత్ర🌹 3⃣3⃣ *వ రోజు* *దారిద్ర్య దుర్భరత :--* 🌻🌻🌻🌻🌻🌻🌻 దక్షిణేశ్వరం నుండి బయలుదేరిన మాతృదేవి *బర్ద్వాన్* వరకు అందరూ రైలులో పయనించారు. అంత దూరం వెళ్లడానికి సరిపడ డబ్బు మాత్రమే ఉంది. ఆ తర్వాత కాలినడకే. మొదటి ఘట్టంగా *పదహారు మైళ్లు* నడచి *ఉచ్చలన్* అనే చోటికి చేరుకున్నారు. మాతృదేవి బాగా అలసి పోయారు. అందువల్ల అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నారు. అక్కడే వంట చేసుకొని భోజనంచేసి పిదప అందరూ కలిసి కామార్పుకూర్ చేరుకున్నారు. గోలాప్ మా తప్ప తక్కిన వారందరూ మాతృదేవితో పాటు మూడు రోజులుండి కలకత్తాకు తిరిగి వెళ్లపోయారు. గోలాప్ మా ఒక నెల రోజులు అక్కడ గగిపారు. ఆనాటి సమాజం వితంతువుకు గౌరవాన్ని, అంతస్తును కల్పించడానికి తయారై లేదు. వితంతువుకు ఎటువంటి వినోదాలు నిషిద్ధం. ఆమెను ఒక జీవచ్ఛవంలా చూసేవారు. గ్రామాలలో ఈ నియమాలు మరీ విపరీతం. ఇక్కడ ఒక వితంతువు - పూర్తిగా తెలుపు రంగు చీర కాక అందులో ఎర్రని అంచు చీర ధరించడం, చేతులకున్న బంగారు గాజులు తీసివేయకపోవడం గ్రామస్థులకు ఇంతకన్నా మరేం కావాలి? సానుభూతి కలగడానికి బదులుగా కోపమూ, ఉక్రోషమూ కలిగ...
🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 🌹 *శారదామాత జీవితచరిత్ర🌹 3⃣7⃣ *వ రోజు* *పంచ తపస్సు :--* 🌻🌻🌻🌻🌻🌻🌻 తమ కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని సముపార్జించడానికి తీవ్రమైన తపోజీవితం చేపట్టడానికి హిమాలయాలకు బయలుదేరాడు నరేంద్రుడు. సెలవు పుచ్చుకోవడానికి అతడు ఒక రోజు మాతృదేవి వద్దకు వచ్చాడు. మాతృదేవికి ప్రణమిల్లి, "అమ్మా! నేను బయలుదేరుతున్నాను. ఒక నిజమైన మనిషిని కాగలిగితే మళ్లీ మిమ్మల్ని దర్శించుకుంటాను. లేకపోతే ఇదే ఆఖరి చూపు” అన్నాడు. నరేంద్రుని మాటలు విని హడలిపోయారు మాతృదేవి. "నాయనా! నువ్వెందుకు అలా అంటున్నావు?" అంటూ మధ్యలోనే ఆతణ్ణి వారించారు. అందుకు నరేంద్రుడు, “అవును. నేను అలా అనివుండకూడదు. ఎందువల్లనంటే మీ కృపాకటాక్షంతో నేను త్వరలో తిరిగి వస్తాను కనుక” అని అన్నాడు. ఆతనితోపాటు గంగాధర్ కూడా వెళ్లనున్నాడు. మాతృహృదయం నరేంద్రునికి సెలవివ్వడానికి నిరాకరించినా, కర్తవ్య నిర్వహణ దానిని అడ్డుకొంది. గంగాధర్ ని పిలిచి, *“నాయనా! నా ఐశ్వర్యాన్నే నీకు అప్పజెప్పుతున్నాను.* హిమాలయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో నీకు తెలుసు. నరేంద్రుడు ఆహారం లేకుండా బాధపడకు...
Comments
Post a Comment