శారదామాత జీవితచరిత్ర Part 39
🌻🌻🌻🌻🌻🌻🌻 🌺శ్రీ మాత్రే నమః🌺 🌹 *శారదామాత జీవితచరిత్ర* 🌹 3⃣9⃣ *వ రోజు* *కుటుంబ పెద్దగా బాధ్యత :-* 🌻🌻🌻🌻🌻🌻🌻 కత్తాలోని కోలాహలంలో ఇరుకైన స్థలాలలో నివసించడం చెరసాలలో ఉన్నట్లే ఉండేది మాతృదేవికి. కలకత్తా చెరసాల నుండి బయటపడి జయరాంబారికి వచ్చాకే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ ప్రాంతాలలో మలేరియా వ్యాధి శాశ్వతంగా ప్రబలి ఉంది. దాన్ని మాతృదేవి ఖాతరు చేయలేదు. మాతృదేవి కామార్పుకూర్ లో పడుతున్న కష్టాలను చూడలేక ఆమె తల్లి జయరాంబాటి రావసలసిందని ఒత్తిడి కారణంగా,మరి కొన్ని కారణాల వలన జయరాంబాటిని స్థిరనివాసంగా ఏర్పరచుకున్నారు. మాతృదేవి తమతోపాటు జయరాంబాటి గ్రామంలో నివసించడం ప్రజలకు ఒక మధురానుభవం. దానితోపాటు మాతృదేవి దర్శనార్థం భక్తులు రావడంవల్ల పండ్లు, కూరగాయలు, పాలు, చేపలు ఇత్యాదుల వ్యాపారం బాగా పెరిగిపోయింది. గ్రామస్తుల పేదరికానికి గుడ్డిలో మెల్లగా అమరింది. కరుణాస్వరూపిణి అయిన మాతృదేవి ఈ కారణం వల్ల కూడా గ్రామంలో జీవించగోరి ఉండవచ్చు. మాతృదేవికి ఐదుగురు తమ్ముళ్లు, చెల్లెలు కాదింబిని ఉండేవారు. ఇందులో కాదంబిని, ఇద్దరు తమ్ముళ్లు యువ ప్రాయంలోనే మరణించారు....